శ్రీదేవి ఇలా చనిపోయిందంటే ఎలా నమ్మారు ?

0శ్రీదేవి మృతి కేసు ఊహించని మలుపులు తిరుగిన సంగతి తెలిసిందే. తొలుత గుండెపోటుతో ఆమె చనిపోయారన్న వైద్యులు తర్వాత ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగి చనిపోయినట్లు తెలిపారు. చివరికి కేసు కూడా ఇలానే క్లోజ్ చేశారు. దీనిపై మీడియా పెద్ద ఎత్తున కధనాలు వచ్చాయి.

ఐతే తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్ని సందేశాలు లేవనెత్తాడు. శ్రీదేవి మ‌ర‌ణం గురించి దుబాయ్ పోలీసులు చెప్పిన విష‌యాన్ని భార‌త మీడియా అంత సుల‌భంగా ఎలా న‌మ్మేసింది. భార‌త్‌లో గ‌తంలో జ‌రిగిన అరుషి, ఇంద్రాణి వంటి కేసుల గురించి ఇక్క‌డి జ‌ర్న‌లిస్టులు చాలా హ‌డావిడి చేశారు. సొంతంగా ఇన్విస్టిగేష‌న్ చేశారు. అలాంటిది శ్రీదేవి మ‌ర‌ణం గురించి దుబాయ్ పోలీసులు చేసిన నాలుగు లైన్ల ట్వీట్‌ను ఎలా న‌మ్మేశారు. కేస్ క్లోజ్ అయిపోయిందంటే ఎందుకు ఊరుకున్నారు. అస‌లు శ్రీదేవి మ‌ర‌ణం గురించి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కూడా దుబాయ్ పోలీసులు అనుకోలేదు. శ్రీదేవి బాత్‌ట‌బ్‌లో ప్ర‌మాద‌వ‌శాత్తూ మునిగి చ‌నిపోయార‌ని చెప్పి కేసును క్లోజ్ చేసేశారు. శ్రీదేవి మ‌ర‌ణానికి దారి తీసిన ప‌రిస్థితుల‌ను, ఇన్విస్టిగేష‌న్ తీరును బ‌య‌టి ప్ర‌పంచానికి వెల్ల‌డిచేయాల‌ని దుబాయ్ పోలీసుల‌పై భార‌త ప్ర‌భుత్వం, మీడియా ఒత్తిడి తీసుకురావాలి.” అంటూ వర్మ ఒక లెటర్ రిలీజ్ చేశాడు.