పూరి తో వివాదం.. క్లారిటీ ఇచ్చిన వర్మ

0

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో పలువురు వర్మ శిష్యులు అనే విషయం తెల్సిందే. వర్మకు పూరి జగన్నాధ్ ప్రియ శిష్యుడు అనే విషయం తెల్సిందే. హైదరాబాద్ వస్తే వర్మ ఎక్కువ గా పూరి ఆఫీస్ లోనే ఉంటాడు. పూరి కి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో వర్మ ఉంటాడు పూరి సినిమాలకు సంబంధించిన చర్చల్లో వర్మ పాల్గొంటాడు అనే టాక్ ఉంటుంది. వర్మను పూరి చాలా గౌరవిస్తాడు. కాని ఈ మద్య వర్మ పై పూరి కి కోపం వచ్చిందని తనకు సినీ కెరీర్ ను ప్రసాదించిన పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయించినందుకు గాను వర్మ పై పూరి చాలా ఆగ్రహంతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ఆ మద్య కాస్టింగ్ కౌచ్ అంటూ శ్రీ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన సమయంలో ఎక్కువ పబ్లిసిటీ కావాలంటే పవన్ ను ఈ విషయంలోకి లాక్కురమని చెప్పింది తానే అంటూ స్వయంగా వర్మ ఒప్పుకున్నాడు. దాంతో ఆయన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది ఆయన్ను అభిమానించే వారు. కాని ఆ సంఘటన తర్వాత ఆయన పై వ్యతిరేక ప్రారంభం అయ్యింది. అలాగే పూరి కూడా అప్పటి నుండి వర్మను దూరంగా ఉంచుతూ వస్తున్నాడు. హైదరాబాద్ వచ్చినా కూడా పూరి ఆఫీస్ కు వర్మ వెళ్లడం లేదు. తాజా గా వర్మ భైరవ గీత చిత్రం ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చినా ఒక హోటల్ లో ఉంటున్నట్లుగా ఒక ఇంగ్లీష్ దిన పత్రికలో కథనం వచ్చింది.

వర్మను పూరి దూరం పెడుతున్నాడు అంటూ ఆ కథనం సారాంశం. గత కొన్ని రోజులుగా సినీ జనాల్లో జరుగుతున్న ప్రచారమే ఆ కథనం రూపంలో వచ్చింది. అయితే ఆ కథనంను వర్మ కొట్టి పారేశాడు. తనకు పూరి ఎప్పటికి మంచి మిత్రుడే ఇష్టమైన వ్యక్తే ఇద్దరి మద్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే పూరి మాత్రం ఈ విషయమై మౌనంగా ఉన్నాడు. పవన్ ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశ్యంతో పూరి ఇంకా కూడా వర్మకు పైకి చూడ దూరంగా ఉంటున్నాడేమో అనిపిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer