టీవీ9పై వర్మ క్రిమినల్ కేసు

0ram-gopal-varma-complaint-aసంఘంలోని ప్రముఖులను ఉద్దేశించి ఎప్పుడూ ఏవో వాఖ్యలతో వార్తలో నిలిచే వర్మ .. ఇప్పుడు ఏకంగా ఒక న్యూస్ ఛానల్ పై పడ్డాడు. టీవీ9 చానెల్‌పై క్రిమినల్‌ అభియోగాలతో పలు కేసులు దాఖలు చేయనున్నట్టు ట్విట్టర్‌లో వెల్లడించాడు ఆర్జీవీ. ప్రస్తుతం తాను ఆ ప్రక్రియలో ఉన్నానని, తన లాయర్లు అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని ట్వీట్‌లో తెలిపాడు.

టీవీ9 మూర్ఖపు కథనాలు ప్రసారం చేస్తోందని, ముంబైలోని తన 27 అంతస్తు టెర్రాస్‌లో ఆ కథనాలు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నానని, టీవీ9 పేరును టీవీ9 సర్కస్‌ జోకర్స్‌గా మార్చాలంటూ ఘాటుగా విమర్శించిన వర్మా ఇప్పుడు ఆ చానెల్‌పై వర్మ కేసులు దాఖలు చేస్తానని అంటున్నాడు.

ఇటీవల వివాదాస్పద ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ వెబ్‌సినిమా విషయంలో వర్మ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసుల విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ నేపధ్యంలో తనపై తప్పుడు వార్తలు ఇచ్చారనేది వర్మ ఆరోపణ.