చంద్రబాబు అన్న మాటలు నిజమే: వర్మ

0RGV‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని ఏమాత్రం వక్రీకరించకుండా తీస్తానని అంటున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. మంగళవారం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపై విరుద్ధంగా ఎవరు సినిమా తీసినా ప్రజలు ఆమోదించరని అన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై వర్మ స్పందిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపై చంద్రబాబు అన్న మాటలు ముమ్మాటికీ నిజమేనని అన్నారు. అందుకే తాను నిజంగా జరిగిన సంఘటనలనే ఏమాత్రం వక్రీకరించకుండా తెరకెక్కించబోతున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు అన్నట్లు నిజంగా ఎన్టీఆర్‌ జీవితం తెరిచిన పుస్తకమేనని పోస్ట్‌లో పేర్కొన్నారు.

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రానికి వైకాపా నేత రాకేశ్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాపై ఎవరు ఎలాంటి కామెంట్లు చేసినా వర్మసోషల్‌మీడియాలో వారికి దీటుగా సమాధానమిస్తున్నారు. 2018 ఫిబ్రవరిలోచిత్రీకరణ మొదలుపెట్టి అక్టోబర్‌లో సినిమా విడుదల చేయనున్నట్లు వర్మతెలిపారు.