ఆ వ్యక్తి వివరాలు ఇస్తే రూ.లక్ష ఇస్తానన్న వర్మ

0

కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో పెద్దగా హడావుడి లేకుండా కామ్ గా ఉన్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గత రాత్రి (శుక్రవారం) నుంచి యాక్టివ్ కావటం తెలిసిందే. వచ్చి రావటంతోనే తాను ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్న వైనాన్ని వెల్లడించటమేకాదు.. ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతి పెళ్లి దండలు మార్చుకునే వేళ.. అక్కడే ఉన్న చంద్రబాబు ఫోటోను పోస్ట్ చేసి సంచలనంగా మారారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ఫోటోను.. వీడియోను పోస్ట్చేసిన వర్మ.. అందులోని వ్యక్తిని తన దగ్గరకు తీసుకొచ్చినా.. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినా రూ.లక్ష ఇస్తానని చెప్పారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే.. ఒక హోటల్లో వడ్డిస్తున్న సర్వర్. స్పెషల్ ఏమంటే..ఆ వ్యక్తి దాదాపుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలికలతో ఉండటం. నిక్కర్.. బనీన్ వేసుకొని వడ్డిస్తున్న ఆ వ్యక్తి వివరాలు తనకు కావాలని.. ఆ వ్యక్తిని వెతికి పట్టుకోవటంలో తనకు ఎవరైనా సాయం చేస్తారా? అని రిక్వెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని తనకు టచ్ లోకి తీసుకొస్తే వారికి రూ.లక్ష రివార్డు ఇస్తానని ప్రకటించారు. మరి..వర్మ రివార్డును ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.
Please Read Disclaimer