శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ కంటే పాపులర్

0గతకొన్ని రోజులగా తెలుగు మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన శ్రీరెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటిబాగోతాలను బయటపెట్టేందుకు ఏకంగా ఒక ఉద్యమాన్ని లేవనెత్తింది. కొందరు తెలుగు సినీ ప్రముఖులు తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఫిలింనగర్‌లోని ‘మా’ అసోసియేషన్‌ ముందు అర్ధనగ్నంగా నిరసన కూడ చేసింది దీంతో ఈ వార్త నేషనల్‌ మీడియా దృష్టిలో పడింది. ప్రముఖ ఆంగ్ల పత్రికలు కూడా ఈ కథనాన్ని ప్రచురించాయి.

కాగా శ్రీరెడ్డి గురించి ప్రస్తావిస్తూ ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా ట్వీట్‌ చేశారు. ‘శ్రీరెడ్డి నేషనల్‌ సెలబ్రిటీ అయిపోయారు. పవన్‌కల్యాణ్ అంటే‌ ఎవరో తెలియని కొందరు ముంబయి వాసులు కూడా ఇప్పుడు శ్రీరెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు.