కేరళ కుట్టిగా బాలీవుడ్ బ్యూటీ…వైరల్!

0మలయాళ నటి షకీలా బయోపిక్ ను ఇంద్రజిత్ లంకేశ్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో షకీలా పాత్రలో నటించేందుకు చాలామందిని సంప్రదించినా…చివరకు బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చద్దాను ఇంద్రజిత్ ఎంపిక చేసుకున్నారు. షకీలా జీవిత విశేషాలను స్వయంగా ఆమెను అడిగి తెలుసుకునేందుకు రిచా….షకీలాను కలిశారు. ఆమె జీవితంలో ఎన్నో మలుపులున్నాయని….ఆమె పాత్రలో నటించడం తనకు సవాల్ వంటిదని రిచా అభిప్రాయపడింది. తాజాగా ఈ చిత్రంలో తన ఫస్ట్ లుక్ ను రిచా ట్విట్టర్ లో షేర్ చేసింది. కేరళలో సంప్రదాయం ప్రకారం కసవ పట్టు చీరలో దర్శనమిచ్చిన రిచా….తన లుక్ తో ఆకట్టుకుంది. కేరళ యువతిగా కనిపిస్తోన్న రిచా లుక్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కర్ణాటకలోని తీర్థ హల్లి ప్రాంతంలో జరుగుతోంది. ఓ సాధారణ యువతి స్థాయి నుంచి పాపులర్ స్టార్ గా షకీలా ఎదిగిన తీరును ఈ చిత్రంలో చూపించబోతున్నారు. దీంతో యువతిగా ఉన్న షకీలాకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే షకీలా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయని ఆమె పాత్రను పోషించడం చాలెంజింగ్ గా ఉందని రిచా తెలిపింది. షకీలా బాడీ లాంగ్వేజ్ ను అనుకరించడం తనకు పెద్ద సవాల్ అని తెలిపింది. ఈ చిత్రంలో షకీలా ప్రేమికుడిగా మలయాళ నటుడు రాజీవ్ పిళ్లై నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2019 ప్రధమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన` డర్లీ పిక్చర్` బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో షకీలా బయోపిక్ పై భారీ అంచనాలున్నాయి.