ఆమె కెరీర్ కు అందమే అడ్డు!

0Richa Gangopadhyay Glamour Problemsపైకి రావడానికి ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన అడ్డంకి వస్తూ ఉంటుంది. రిచా గంగోపాధ్యాయకి అయితే గ్లామరే అడ్డయ్యిందట. హీరోయిన్లను గ్లామర్ చూసే సినిమాల్లోకి తీసుకుంటారు. అది ఉన్నంతకాలమే వాళ్లు కొనసాగుతూ ఉంటారు. ఇది ఎప్పుడూ జరిగేదే. రిచాకి కూడా గ్లామర్ ఫుల్ గా ఉంది. కానీ దాన్ని చూపించడానికే ఇబ్బంది పడుతోంది. అందువల్లే ఆమెను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలన్నీ ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్లిపోతున్నాయి. లీడర్ సినిమాతో ఎంటరైన రిచాకి సక్సెస్ రావడానికి కాస్త ఎక్కువ టైమే పట్టిందని చెప్పాలి. మిర్చి హిట్ కావడంతో కాస్త అవకాశాలు మెరుగుపడ్డాయి.

ప్రస్తుతం నాగార్జునతో భాయ్ చేస్తోంది. ఒకట్రెండు ప్రాజెక్టులు రెడీగా కూడా ఉన్నాయి. అయితే తను ఓకే చేసినవి తక్కువే అయినా వచ్చిన అవకాశాలు మాత్రం చాలా ఎక్కువేనంటోంది రిచా. హద్దులు దాటి అందాలు ప్రదర్శించడానికి తాను నో అనడం వల్ల కొందరు అవకాశం ఇవ్వకుండా ఆగిపోయారట. కొందరు నిర్మాతలైతే అడిగినంత ఇస్తామన్నారట. కాకపోతే బికినీ వేయాలని కండిషన్ పెట్టారట. కానీ రిచా అందుకు సిద్ధపడలేదు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కాస్తో కూస్తో ఒళ్లు చూపిస్తాం కానీ, మరీ బరితెగించడం తన వల్ల కాదు అంటోంది. దానివల్ల అవకాశాలు పోయినా ఫర్వలేదని చెప్పేస్తోంది. ఇంతకుముందు చాలామంది ఇలా చెప్పారు. కానీ చాన్సులు తగ్గాక చెప్పిన మాటను మర్చిపోయి అన్నటికీ సిద్ధమైపోయారు. చూద్దాం… ఈ మేడమ్ ఎన్నాళ్లు మాట మీద నిలబడుతుందో!