సల్మాన్ మరదలితో సీనియర్ నటుడు అసభ్య ప్రవర్తన

0వయసు మీదకు రాగానే సరిపోదు. విచక్షణ ఉండాలి. అలాంటివి తనలో మిస్ అయినట్లుగా వ్యవహరించి తాజాగా అభాసుపాలయ్యారు బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరదలితో అసభ్యంగా ప్రవర్తించి హాట్ టాపిక్ గా మారారు.

ఇటీవల ప్రముఖ సినీ నటి సోనమ్ కపూర్ పెళ్లి వేడుక జరిగిన సంగతి తెలిసిందే. వివాహ రిసెప్షన్ కు రిషీ కపూర్.. తన భార్య నీతూతో కలిసి వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సల్మాన్ తో సహా.. ఆయన మరదలు సిమీఖాన్ హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. సిమీఖాన్ పట్ల రిషీ కపూర్ అసభ్యంగా వ్యవహరించటం హాట్ టాపిక్ గా మారింది.
తన పట్ల రిషీ కపూర్ వ్యవహరించిన తీరుతో ఆగ్రహం చెందిన సిమీఖాన్.. విషయాన్ని సల్మాన్ దృష్టికి తీసుకెళ్లారట. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన సల్మాన్ రిషీ వద్దకు వెళ్లారని.. అప్పటికే ఆయన వేడుక నుంచి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారం తెలుసుకున్న రిషీ సతీమణి నీతూ.. సిమీకి వ్యక్తిగతంగా సారీ చెప్పారట. పెద్ద మనసుతో క్షమించాలని కోరారట. ఇదిలా ఉంటే.. అంత వయసు మీద పడిన రిషీ అంత ఛండాలంగా ఎందుకు వ్యవహరించారన్న ప్రశ్నకు చిత్రమైన కారణాన్ని చెబుతున్నారు. వేడుకకు వచ్చిన సల్మాన్ .. రిషీని పలుకరించకుండా మిగిలిన వారితో క్లోజ్ గా ఉన్నారని.. ఈ కారణంతోనే సల్మాన్ మరదల పట్ల అసభ్యంగా వ్యవహరించారని చెబుతున్నారు. సల్మాన్ మీద కోపం ఉండే.. ఆయన మరదలి మీద చూపించటం ఏమిటి చంఢాలంగా?