పేపర్‌లో న్యూస్ చూసి షాకయ్యా: బన్నీ

0Allu-Arjun-Speech-at-Traffiరెండు సంవత్సరాల క్రితం పేపర్‌లో వచ్చిన ఒక వార్తను చూసి షాకయ్యానని సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమానికి రాజమౌళితో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. ‘‘పోలీసు వారు నన్ను ముఖ్య అతిథిగా రమ్మంటే.. ఇంకా ఎవరు వస్తున్నారు అని అడిగా. వాళ్లు రాజమౌళి గారి పేరు చెప్పగానే చాలా సంతోషించా. ఎందుకంటే.. రెండు సంవత్సరాల క్రితం అనుకుంటా. నైట్ అంతా న్యూ ఇయర్ పార్టీ చేసుకుని పడుకున్నా. ఉదయాన్నే లేచి పేపర్ చూడగానే ఒక వార్త చూసి షాకయ్యా. అదేంటంటే.. రాజమౌళిగారు నైట్ అంతా రోడ్డుపై నిలబడి ట్రాఫిక్ కంట్రోల్ చేశారట. నిజంగా ఈ వార్త చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది. డైరెక్టర్‌గా ఆయనెంతో సాధించారు. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించే రాజమౌళి గారు ఈ కార్యక్రమంలో ఉన్నందుకు గర్వపడుతున్నా’’ అని బన్నీ అన్నాడు.

డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ.. తనకు మద్యం తాగే అలవాటు లేకపోవడంతో ఆ సమయంలో ఎలా ఉండాలనేది తనకు తెలియదని సినీ దర్శకుడు రాజమౌళి అన్నారు. కుర్రకారు సరదాగా మందేసినా.. డ్రైవ్‌ మాత్రం చేయవద్దని రాజమౌళి సూచించారు. స్నేహితుల సహకారంతో ఇల్లు చేరాలని సూచించారు.