మహేష్ బావతో శిష్యురాలి జోడీ

0Ritika-Singh-With-Sudheer-Babuరితికా సింగ్ ఇప్పటికే టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. వెంకటేష్ మూవీ గురుతో చెప్పుకోదగ్గ గుర్తింపునే సంపాదించుకుంది. స్పోర్ట్స్ పర్సన్ నుంచి సిినిమా హీరోయిన్ గా మారిన ఈమె.. వరుస సినిమాలతో దూసుకొచ్చేస్తోంది.

ఇప్పటికే ఈ భామ తమిళ్ లో చాలా బిజీ. గురు మూవీకి మాతృక సాలా ఖద్దూస్.. తమిళ నాట సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. మాస్ రోల్ లో ఈమె ఒదిగిపోయిన తీరు.. తమిళ ఆడియన్స్ ను.. మేకర్స్ ను ముగ్ధులను చేసేసింది. అందుకే.. అక్కడ రితికకు బోలెడన్ని సినిమా ఛాన్సులు చేతిలో ఉన్నాయి. పైగా ఒకే టైపు రోల్స్ మాత్రమే కాకుండా.. పలు వేరియేషన్స్ లో తన ట్యాలెంట్ ను చూపించే అవకాశం ఈమెకు దక్కుతోంది. గురు సక్సెస్ తర్వాత టాలీవుడ్ నుంచి కూడా ఈమెకు బాగానే అవకాశాలు అందుతున్నాయి. అయితే.. తెలుగులో తన రెండో సినిమా విషయంలో చాలా కేర్ తీసుకున్న ఈమె.. సక్సెస్ అవకాశాలతో పాటు తన కేరక్టర్ ప్రాధాన్యతకు బాగా ఇంపార్టెన్స్ ఇఛ్చింది. అందుకే చాలా సబ్జెక్టులు విన్న తర్వాత.. మహేష్ బాబు సుధీర్ బాబు సినిమాలో చేసేందుకు సైన్ చేసినట్లు తెలుస్తోంది.

కొత్త దర్శకుడు రాజశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎమోషనల్ యాంగిల్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే క్యాస్టింగ్ పనులు పూర్తయిపోయాయని.. అనౌన్స్ మెంట్ చేయగానే మూవీ షూటింగ్ కూడా మొదలుపెట్టేస్తారని అంటున్నారు.