నేను మంచి నటిని అంటున్నారంతా..

0ritu-varmaతెలుగు లో వచ్చిన సినిమా పెళ్లి చూపులు సక్సెస్ ఆ సినిమా లో చేసిన హీరో హీరోయిన్ కి మంచి అవకాశాలే తెచ్చిపెడుతున్నాయి. పెళ్లి చూపులు హీరోయిన్ రీతు వర్మ ఇప్పుడు తమిళ్ తెలుగు లో బాగానే బిజీ అయింది. ఆ సినిమాకు నేషనల్ లెవెల్లో చక్కటి ప్రాంతీయ చిత్రంగా కూడా గుర్తింపు లభించింది.

ఇప్పుడు రీతు వర్మ తాజా తెలుగు చిత్రం కేశవ విడుదలకి సిద్దంగా ఉంది. తమిళ్ పెళ్లి చూపులులో కూడా తమన్నా పేరు వినిపిస్తున్నప్పటికీ ఈమెనే హీరోయిన్ గా అనుకుంటున్నారు. అది కాకుండా విక్రమ్ కొత్త మూవీ ధృవ నక్షత్రం లో కూడా నటిస్తుంది. ఇప్పుడు కేశవ సినిమా విడుదల సంధర్భంగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా తన భావాలును పంచుకుంది “నన్ను అంతా మంచి నటిగా గుర్తించారు. కొత్త హీరోయిన్ లా కాకుండా ఒక నటిగా గౌరవించడం కొంచం(చాలా) బాగుంది అని చెప్పి మురిసిపోతుంది. అసలు ఈ సినిమా కూడా నాకు పెళ్లి చూపులు వలనే వచ్చింది అని చెప్పింది. డైరెక్టర్ సుధీర్ వర్మ ఆ సినిమా చూసాకే నాకు స్క్రిప్ట్ చెప్పడానికి ఫోన్ చేశారు. ఇంకా ఈ సినిమా లో నా కొ స్టార్ నిఖిల్ ఎనర్జి నిజాయితికి నేను ఫిధా అయ్యాను” అని చెప్పింది. మరి గ్లామర్ రోల్స్ వస్తే చేస్తారా అంటే ”తప్పకుండా చేస్తాను నటిని అంటే అన్నీ చెయ్యాలి కదా” అని చెప్పింది.

కేశవ సినిమా ఈ నెల 19న విడుదల కావస్తోంది. ఈ సినిమా నిర్మాత అభిషేక్ డైరెక్టర్ సుధీర్ వర్మ సంగీతం సన్నీ ఏం ఆర్. నిఖిల్ హీరోగా సుధీర్ డైరక్షన్లో ఇది రెండో సినిమా. వీళ్ళ మొదటి కాంబినేషన్లో వచ్చిన సినిమా స్వామి రా రా కూడా చిన్న చక్కటి విజయం దక్కించుకుంది. అదే యూత్ జోష్ ఈ సినిమా లో ఉంటుంది అని భావిస్తూ సినిమా హాల్ లోకి వెళ్ళద్దాం.