రాజమౌళి చిత్రంలో రీతు వర్మ

0Ritu-Varma-in-Baahubali-Vr-Characterతాజాగా రాజమౌళి తాను వర్చువల్ రియాలిటీ ఫిలిం డైరెక్టర్ గా పరిచయం అవుతున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. అటు బాహుబలి ది కంక్లూజన్ ను ఫినిష్ చేస్తూనే.. మరోవైపు ది స్వోర్డ్ ఆఫ్ బాహుబలి అంటూ వర్చువల్ రియాలిటీ పిక్చర్ ని సిద్ధం చేస్తూన్నారు. మరోవైపు ఇందులో దేశంలో మొట్టమొదటి వర్చువల్ రియాలిటీ కేరక్టర్ ను పోషిస్తోంది .. పెళ్లిచూపులు హీరోయిన్ రీతు వర్మ.

‘పెళ్లి చూపులు తర్వాత ది స్వోర్డ్ ఆఫ్ బాహుబలి పేరిట సిద్ధమవుతున్న ఈ వీఆర్ ఫిలిం కోసం నన్ను సంప్రదించారు. నాకు దాని సాంకేతికత ఏమీ తెలీదు. అయినా సరే బాహుబలి లాంటి ప్రపంచంలో భాగం అయినందుకు.. అందులోనూ రాజమౌళి సార్ తో పని చేస్తుందన్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పింది రీతు వర్మ. తాజాగా ఈ మూవీలో రీతువర్మ పాత్రకు సంబంధించిన వర్చువల్ రియాలిటీ ఫోటో ఒకటి ఆన్ లైన్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘ఏదైనా కొత్తది నేర్చుకోవడం నటులకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. నేను ఈ పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాను. స్పెషల్ వీఆర్ కెమెరాతో అమెరికాలో నాకు ఫేషియల్ స్కాన్ చేశారు. 20-30 ఎక్స్ ప్రెషన్స్ ను కాప్చర్ చేశారు. ఇదో కొత్త అనుభవం’ అని చెప్పింది రీతు వర్మ.