ఈ ఫోజు చూస్తే కలల్లో కల్లోలమే

0

1991లో `విష కన్య` అనే హిందీ సినిమాతో బాలనటిగా కెరీర్ ప్రారంభించింది రియా సేన్. నటి మున్ మున్ సేన్ నటవారసురాలిగా బాలీవుడ్ కి పరిచయమై… అటుపై తమిళ్.. మలయాళం.. తెలుగు చిత్ర పరిశ్రమల్లోనూ అడుగు పెట్టింది. 2014 నుంచి నాలుగైదేళ్లు వరుసగా మాతృపరిశ్రమ బెంగాళీకే అంకితమైంది. 2017లో `రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్` వెబ్ సిరీస్ తో తిరిగి హిందీ పరిశ్రమకు రిటర్న్ అయ్యింది. అటుపై పెద్ద తెరపై తిరిగి బిజీ అవుతుందని భావించినా ఎందుకనో ఇంకా ఛాన్సులే లేవ్. ప్రస్తుతం మరోసారి హిందీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోందట. ఆ క్రమంలోనే పలు లఘు చిత్రాల్లో నటిస్తూ తనని తాను ప్రమోట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో పాటే సామాజిక మాధ్యమాల్లో నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో రియా అదరగొడుతోంది.

క్యూట్ లుక్.. హాట్ అప్పియరెన్స్ కాంబినేషన్ రియాకి ప్రధాన బలం. తాజాగా రివీలైన ఈ కొత్త లుక్ ఆ సంగతినే చెబుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయిపోతోంది. ఈ ఫోజులో రియా కిల్లర్ లుక్ కట్టి పడేస్తోంది. లైట్ ఆరెంజ్-రెడ్ మిక్స్ చేసిన థిక్ కలర్ డ్రెస్ లో తళతళలాడుతోంది. అందాల్ని ఇంచి ఇంచి కొలత కొలిచి వడ్డించడంలో తనని కొట్టే స్పెషలిస్ట్ వేరొకరు లేరు! అన్నంతగా అద్భుతమైన ఫోజును ఇచ్చింది. ఆ థైస్ సౌందర్యాన్ని ఓ లెవల్లోనే ఎలివేట్ చేసింది. ఆ సోగ కళ్లను అంతే ఇదిగా గుండెల్లో గుచ్చుకునేలా తిప్పేస్తోంది. ఓవరాల్ గా కుర్రాళ్లను మాత్రం కిల్ చేస్తోంది.

అన్నీ ఉన్నా నటన పరంగా ది బెస్ట్ అన్న పేరు మాత్రం తెచ్చుకోలేకపోయింది. కెరీర్ పరంగా ఆశించిన స్థాయిని అందుకోవడంలో తడబడింది. రియా సేన్ తెలుగులో మంచు మనోజ్ సరసన `నేను మీకు తెలుసా?` అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత వేరొక తెలుగు సినిమాలో నటించిందే లేదు. ప్రస్తుతానికి ఫోటో షూట్లతో.. లఘు చిత్రాలతో టచ్ లో ఉంది. హోప్ మాత్రం వదిలేయలేదు. ఇలా యూత్ ని కవ్వించే వాడి వేడి తెలిసినా ఎందుకనో ఇంకా వెయిటింగ్! ఇకనైనా జాక్ పాట్ కొడుతుందేమో వేచి చూడాలి.
Please Read Disclaimer