ప్రియుడ్ని పెళ్లాడబోతున్న హీరోయిన్

0Riya-sen-set-get-married-loverబాలీవుడ్ చిత్రసీమలో మరో హీరోయిన్ పెళ్లి భాజాలు మ్రోగబోతున్నాయి. ‘విష కన్య’ అనే బాలీవుడ్ మూవీతో 1991లో కెరీర్ మొదలు పెట్టి హిందీ, తెలుగు, మళయాలం, తమిళం, ఒరియా, బెంగాళీ ఇలా చాలా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రియా సేన్ త్వరలో తన ప్రియుడిని పెళ్లాడబోతోంది.

రియా సేన్ కొంత కాలంగా బాయ్ ఫ్రెండ్ శివమ్ తివారీతో డేటింగ్ చేస్తోంది. 36 ఏళ్ల ఈ బ్యూటీ ఇక ప్రేమ కలాపాలకు పులిస్టాప్ పెట్టి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. ఆగస్టు నెలాఖరులోనే రియా సేన్-శివమ్ తివారి వివాహం జరుగబోతోందని సమాచారం.

ఫోటోగ్రాఫర్ అయిన శివమ్ తివారీ, రియా సేన్ మధ్య గత కొన్నేళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసకున్నారు. అంతా ఒకే అనుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటి మున్ మున్ సేన్ కూతురైన రియా సేన్…… తన ప్రేమ వివాహానికి ఇంట్లోవారిని కూడా ఒప్పించిందట. ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఈ వివాహం జరుగబోతోంది.

రియా సేన్ తనకు కాబోయేవాడు ఆలోచనలో ఇంటలిజెంట్, ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో స్మార్ట్…. బాలీవుడ్ పరిశ్రమ బయటివాడు అయి ఉండాలని అని కోరుకునేది. ఆమె కోరుకున్న విధంగానే తగిన వాడు ఆమెకు భర్తగా రాబోతున్నాడు.

గతంలో రియా సేన్ మీద చాలా రూమర్స్ వినిపించాయి. ఆమె కొంతకాలంగా అష్మిత్ పటేల్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. తర్వాత క్రికెట్ శ్రీశాంత్‌తో కూడా ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. సెలబ్రిటీ సర్కిల్‌లో ఇవన్నీ చాలా కామన్ కాబట్టి రియా సేన్‌కు కాబోయేవాడు వీటిని లైట్ తీసుకున్నాడు.