ఫైనల్ షెడ్యూల్స్ లో రోబో 2.0!

0Robo-2-0-final-schedule-statusసూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ‘రోబో2.0’ ఆఖరి దశకు చేరుకుంది. ఈ రోజు నుండి ఈ చిత్రం యొక్క ఆఖరి షెడ్యూల్ మొదలుకానుంది. ఇప్పటికే 80% పైగా షూటింగ్ పూర్తవగా మెలిగిన కాస్త షూట్ ఈ షెడ్యూల్లో పూర్తికానుంది. ఈ షూటింగ్లో రజనీతో పాటు హీరోయిన్ అమీ జాక్సన్ కూడా పాల్గొంటుంది. వీరిద్దరి కాంబినేషన్లో సన్నివేశాల చిత్రీకరణ ఉండనుంది.

మరోవైపు ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2010లో రిలీజైన భారీ బ్లాక్ బస్టర్ ‘రోబో’ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ఇండియన్ సినిమాలోనే అతి భారీ బడ్జెట్ చిత్రంగా ప్రచారం పొందుతున్న దీన్ని లైకా ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మిస్తోంది. ఇకపోతే చిత్రం యొక్క టీజర్ ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసి చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు దర్శక నిర్మాతలు.