పూరి జగన్నాథ్‌ ‘రోగ్’ చిత్రం సెన్సార్‌ పూర్తి

0



Rogue-Movie-Completes-Censorడేరింగ్ అండ్ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఇషాన్‌ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా. సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ). ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఉగాది కానుకగా మార్చి 31న వరల్డ్‌వైడ్‌గా తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. ఇషాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. అనూప్‌సింగ్‌, ఆజాద్‌ ఖాన్‌, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్‌, సుబ్బరాజ్‌ తదితరులు ఈ సినిమాలో సందడి చేయనున్నారు. సునీల్ కష్యప్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.