రోహిత్ శర్మ డబుల్ ధమాక

0rohithరోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్ గా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ తిరుగులేని ఆటతీరుతో డబుల్ సెంచురీ సాధించాడు. వరుసగా వికెట్లు పడుతున్నాధోనీ అండతో రోహిత్ చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో పలు రికార్డులు సాధించాడు.

అత్యధిక సిక్సులు సాధించిన భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. కేవలం 156 బంతుల్లో రోహిత్ శర్మ అజేయంగా 209 పరుగులు సాధించాడు.

డబుల్ సెంచురీ చేసిన మూడో ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. దీంతో.. భారత్ ఆసీస్ ముందు  384 పరుగుల భారీ లక్ష్యాన్ని వుంచింది.