అవెంజర్స్ బాలీవుడ్ వెర్షన్ రెడీ అవుతోందా?

0

బాలీవుడ్ దర్శకుడు రోహిత్ సినిమాలకు క్రిటిక్స్ నుండి పెద్దగా రేటింగ్స్ రావు కానీ బాక్స్ ఆఫీసుని ఆయన సినిమాలు కుమ్మేస్తాయి. ఇక ఆయన రూపొందించిన మాస్ మసాలా పోలీస్ యాక్షన్ సినిమాలకు బాలీవుడ్ లో బోలెడు క్రేజ్ ఉంది. 2011 లో అజయ్ దేవగణ్ తో ‘సింగం’ సినిమా.. 2014 లో ఆయనతోనే ‘సింగం రిటర్న్స్’ తెరకెక్కించి హిట్స్ సాధించాడు. 2018 లో రణవీర్ సింగ్ తో ‘సింబా’ రూపొందించి మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ తో మరో పోలీస్ స్టొరీ ‘సూర్యవంశీ’ ను మొదలుపెట్టాడు

ఈ సినిమా ప్రారంభం సందర్భంగా ఇన్స్టా లో ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో పోస్ట్ చేస్తూ “యూనివర్స్ ఇంకా విస్తరిస్తోంది.. మా ఆట మొదలవుతోంది.” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోలో అజయ్ దేవగణ్.. రణవీర్ సింగ్.. అక్షయ్ కుమార్..కరణ్ జోహార్ తో పాటుగా తను కూడా పోజిచ్చాడు. ఈ ఫోటోలో రోహిత్ డైరెక్ట్ చేసిన కాప్ ఫిలిమ్స్ హీరోలందరూ ఉన్నారు. కొత్తగా ‘సూర్యవంశీ’ తో అక్షయ్ కుమార్ కూడా ఈ కాప్ యూనివర్స్ లోకి అడుగుపెట్టాడు. ‘సూర్యవంశీ’ 2020 ఈద్ సందర్భంగా రిలీజ్ అవుతుందట.

అయితే ఈ గ్యాంగ్ అంతా ఇలా ఫోటోకు కలిసి పోజివ్వడం మొదటి సారి కాదు. జనవరి 7 న ఇదే గ్యాంగ్ కలిసికట్టుగా ఒక పోజిచ్చారు. అప్పట్లో కరణ్ జోహార్ ఆ ఫోటోను పోస్ట్ చేశాడు. పాత ఫోటోలో రణవీర్ సింగ్ ఆలివ్ గ్రీన్ కలర్ డ్రెస్ లో ఉన్నాడు.. కొత్త ఫోటోలో మాత్రం పూలరంగడిలా ఉన్నాడు. అయితే రోహిత్ శెట్టి.. కరణ్ జోహార్లు ఈ విధంగా ముగ్గురు మాస్ హీరోలతో యూనివర్స్ అంటూ ఉంటే… హాలీవుడ్ ‘అవెంజర్స్’ తరహాలో ముగ్గురు హీరోలను కలిపి ఇండియన్ అవెంజర్స్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియాలో గుసగుసలు మొదలయ్యాయి. ‘సూర్యవంశీ’ తర్వాతా రోహిత్ శెట్టి ప్రాజెక్ట్ అదేనని కూడా అంటున్నారు!




Please Read Disclaimer