టి20 జట్టుకు రోహిత్‌ శర్మ నాయకత్వం

0rohith-sharma-captianరాణించిన క్రికెటర్లతో మూడు ఫార్మాట్లకు టీమ్‌లను ఎంపిక చేసింది. ఆయా ఆటగాళ్లకు ఓట్లు వేయాలని వీక్షకులకు సూచించింది. ఈఎస్‌పీఎన్‌ ఎంపిక వన్డే జట్టుకు విరాట్‌ కోహ్లిని కెప్టెన్‌గా పెట్టింది. టెస్టు టీమ్‌కు స్టీవ్‌ స్మిత్‌, టి20 జట్టుకు రోహిత్‌ శర్మ నాయకత్వం వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. అనూహ్యంగా టి20 టీమ్‌లో కోహ్లికి చోటు దక్కలేదు. టెస్టు జట్టులో కోహ్లి, చతేశ్వర్‌ పుజారా మాత్రమే ఉండగా, మన బౌలర్లు చోటు సంపాదించలేకపోయారు. ఫాస్ట్‌ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా.. వన్డే, టి20లోనూ చోటు దక్కించుకున్నాడు. వన్డే టీమ్‌లో ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు ఉండటం విశేషం.

టెస్ట్‌ టీమ్‌: స్టీవ్‌ స్మిత్(కెప్టెన్), డీన్‌ ఎల్గర్, డేవిడ్‌ వార్నర్‌, పుజారా, విరాట్‌ కోహ్లి, షకీల్‌ అల్‌, ముషాఫిర్‌ రహీం, లియన్‌, రబడ, ఆండర్సన్‌, నీల్‌ వాగ్నర్‌

వన్డే జట్టు: కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, డీ కాక్‌, జోయ్‌ రూట్‌, బాబర్‌ అజామ్‌, హార్దిక్‌ పాండ్యా, స్టోక్స్, హసన్‌ అలీ, రషీద్‌ ఖాన్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌

టి20 టీమ్: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), లూయిస్‌, మెక్‌కల్లమ్‌, హాషిమ్‌ ఆమ్లా, బట్లర్‌, క్రిస్టియాన్‌, కీరన్‌ పొలార్డ్‌, సునీల్‌ నరైన్‌, రషీద్‌ ఖాన్‌, హసన్‌ అలీ, జస్‌ప్రీత్‌ బుమ్రా