పిల్లలతో కలసి హోలీ ఆడిన రోజా

0రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజా అన్న వెంటనే ఆమెకు సంబంధించి రెండు విషయాలు చప్పున గుర్తుకొస్తాయ్. పదునైన వ్యాఖ్యలతో ప్రత్యర్థి పార్టీల చుక్కలు చూపించే ఫైర్ బ్రాండ్ గా.. టీవీలో కామెడీ షోలో కూల్ కూల్ గా నవ్వులు చిందిస్తున్న వైనం కళ్ల ముందు కదలాడుతుంది. ఏ మాత్రం సంబంధం లేని రెండు కోణాల్లో కనిపించటం ఆమెకు మాత్రమే చెల్లుతుంది.

ఈ రెంటికి భిన్నంగా ఆమె హోలీ వేళ కనిపించారు. పిల్లలతో హుషారుగా పరుగులు దీస్తూ.. తనూ చిన్నపిల్లగా మారిపోతూ.. ఉరకలేసే ఉత్సాహంతో హోలీ ఆడిన తీరు చూస్తే..రోజానేనా? అన్న భావన కలగటం ఖాయం. హోలీ పండుగ వేళ..రంగులతో పిల్లల మీద పోస్తూ..పరిగెత్తుతున్న వారిని ఒడిసి పట్టుకొని.. వారి ముఖాన రంగులు అద్దేయటమే కాదు.. తన మీద రంగులు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నవారికి అందకుండా పరుగులు తీసిన వైనం ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి.

పిల్లల్లో పిల్లల్లా కలిసిపోయి..వారిలో ఒకరిగా మారిన రోజాను చూసినప్పుడు.. పిల్లలతో ఎలా గడపాలన్న విషయం చప్పున స్ఫూరణకు వచ్చేలా వీడియో ఉందని చెప్పక తప్పదు. రాజకీయ..సినిమారంగాల్లో ఉండేవారు తీరికలేని బిజీ షెడ్యూల్ లో ఉన్నా.. తమ పిల్లలతో ఎలా గడపాలన్న విషయన్ని రోజా మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించారని చెప్పక తప్పదు.