రోజా పార్ట్ టైం ఎమ్మెల్యే

0వైసీపీ ఎమ్మెల్యే రోజాపై హోంమంత్రి చిన్నరాజప్ప తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు దద్దమ్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రోజా కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు మంత్రి చిన రాజప్ప.

రోజా ఒక పార్ట్ టైమ్ ఎమ్మెల్యే అంటూ ఎద్దేవా చేశాడు. ఇలాంటి సున్నితమైన ఘటనలను కూడా రాజకీయం చేయాలనుకోవడం చాలా దారుణం. నిందితుడి కోసం 15 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అవసరమైతే మరిన్ని టీమ్’లను రంగంలోకి దించుతాం. నిందితుడికి సంబంధించిన ఆచూకీని ఎవరైనా చెబితే బహుమానం అందిస్తాం. బాధితురాలి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించామని తెలిపారు మంత్రి.