రూ. 17 కోట్లకు కన్యత్వ వేలం

0alexandra-kefrenడబ్బు అవసరం ఎంత పనైనా చేయిస్తుంది. కాలేజి ఫీజు కోసం తన కన్యత్వాన్ని వేలానికి పెడుతున్నానని రొమేనియాకు చెందిన అలెగ్జాండ్రా కెఫ్రెన్‌ గత ఏడాది తొలిసారి ప్రకటించినప్పుడు ప్రపంచమంతా షాకైంది. సోషల్‌ మీడియాలో పలువురు ఆమె నిర్ణయం పట్ల దుమ్మెత్తి పోశారు. కానీ, ఇప్పుడు ఆమె తన కన్యత్వ వేలం ద్వారా దాదాపు రూ. 17 కోట్లు సంపాదిస్తోంది. ఈ విషయాన్ని కెఫ్రెన్‌ తాజాగా ప్రకటించింది.

జర్మనీకి చెందిన ఓ ఎస్కార్ట్‌ సంస్థ ద్వారా ఆమె వేలం పూర్తయింది. ముందుగా ఆమె ఒక మిలియన్‌ యూరోలతో వేలం ప్రారంభించగా, చివరకు హాంగ్‌ కాంగ్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త 2.5 మిలియన్‌ యూరోలకు ఆమెను పాడుకున్నాడు. సిండ్రెల్లా ఎస్కార్ట్‌ సంస్థ ద్వారా అతడు సంప్రదించాడు. భవిష్యత్తులో ఎవరైనా స్నేహితుడికైనా తాను తన కన్యత్వాన్ని సమర్పించాల్సిందేనని, ఆ తర్వాత అతడు తనతో శాశ్వతంగా ఉండకుండా వదిలి వెళ్లిపోతాడని, అలాంటప్పుడు తన కాలేజి ఫీజు అవసరాలు తీర్చుకోడానికి ఇలా కన్యత్వాన్ని వేలం వేస్తే తప్పేముందని కెఫ్రెన్‌ వాదించింది. తాను ఇలా చేయడం పట్ల చాలామందికి భిన్నాభిప్రాయాలున్నాయని, కానీ తన కాళ్ల మీద తాను నిలబడాలనుకునే ఈ పని చేస్తున్నానని స్పష్టం చేసింది. అయితే, కాలేజి ఫీజు కోసం ఇలా వేలం వేసినట్లు ఆమె చెబుతున్నా, ఆమె తల్లిదండ్రులు బాగానే డబ్బున్నవాళ్లని తెలుస్తోంది.

20 శాతం కమీషన్‌..

ఈ వేలం విషయంలో ఆమెకు సహకరించినందుకు సిండ్రిల్లా ఎస్కార్ట్‌ సంస్థ 20 శాతం మొత్తాన్ని కమీషన్‌గా తీసుకుని, మిగిలినదాన్ని మాత్రమే ఆమెకు ఇవ్వనుంది. ఈ విషయం కూడా ముందుగానే ఒప్పందంలో ఉంది.