పోలీసులంటే పెద్ద పుడింగులే!

0

తమిళ డబ్బింగ్ సినిమాలు మనకు చాలా కామన్. ఇక తెలుగులో కాస్త పాపులారిటీ ఉన్న తమిళ హీరో అయితే మార్కెట్ తో సంబంధం లేకుండా వరసగా ప్రేక్షకులపైకి వదులుతారు. ‘బిచ్చగాడు’ సినిమాతో సెన్సేషన్ సృష్టించి తెలుగులో పాపులర్ అయిన విజయ్ అంటోనీ అలాగే వరసగా తన సినిమాలను తెలుగులోకి డబ్ చేస్తూ వస్తున్నాడు. బిచ్చగాడు తరవాత వచ్చిన విజయ్ సినిమాలన్నీ తెలుగు ప్రేక్షకుల సహనాన్ని పరిక్షించాయి. తాజాగా ‘రోషగాడు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్దం అయ్యాడు. ‘రోషగాడు’ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది.

రెండు నిముషాల లోపు నిడివి ఉన్న ఈ టీజర్లో విజయ్ అంటోనీ ఒక పవర్ ఫుల్ పోలీసు అవతారం లో కనిపించాడు. పెద్దపెద్దగా కేకలు.. పెడబొబ్బలు పెడుతూ జనాలకు క్లాసు పీకుతూ “ప్రజలను కాపాడే పోలీసులు పెద్ద పుడింగులే” అంటూ హంగామా చేస్తున్నాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ లో ‘నగనగనగ నగిననగిన డిగుడిగుడిగు డిగినడిగిన.. లేచిరా స్వామీ లేచిరా’ అంటూ ఒక రచ్చ రంబోలా సాంబార్ ల్యాండ్ పాట! కరెక్ట్ గా చెప్తే ‘సింగం’ సినిమాలో సూర్య టైపు పాత్రను విజయ్ చేయాలని బాగా ముచ్చట పడ్డట్టుగా ఉంది. అక్కడ సూర్య మంచి నటుడు ఆ హంగామా సెట్ అయింది. కానీ ఇక్కడ ఈ నగనగ నగిననగిన డిగుడిగు డిగినడిగిన మాత్రం తమిళ దబిడి దిబిడి లాగా ఉంది.

వీటికి తోడు జాతర మ్యూజిక్.. ఒక సన్నటి ఇనప చువ్వను ఎడమ బుగ్గలో పొడుచుకుని కుడి బుగ్గలోనుండి బయటకు తీసే షాట్ లు చూస్తే ఇది 100% తమిళ నేటివిటీ ఉన్న రోషగాడు అని మనకు వెంటనే అర్థం అవుతుంది. ఎంతైనా తెలుగు వాళ్ళు తెలివైన వాళ్లు కదా వెంటనే పట్టేస్తారు!

ఈ సినిమాలో నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు గణేష్. అమ్మలారా అయ్యలారా.. ఇక ఈ రోషగాడి హంగామా మీరు కూడా చూడండి.
Please Read Disclaimer