సిరివెన్నెలకు అన్యాయం: ఆర్పీ పట్నాయక్

0Rp-patnaikకేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఈ సారి కూడా ప్రముఖ తెలుగు రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి మొండి చేయి లభించడంతో సంగీత దర్శకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్ నిరసన వ్యక్తం చేసారు.

దశాబ్దాలుగా తెలుగు సినిమాకు సాహిత్య సేవ చేస్తున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి పద్మ అవార్డుల విషయంలో అన్యాయం జరుగుతోందని, ఆయన్ను ప్రభుత్వాలు గుర్తించక పోవడం తనను తీవ్ర నిరాశకకు గురి చేసిందని ఆర్పీ పట్నాయక్ సోషల్ మీడియా ద్వారా వాపోయారు.

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు (తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్) ఇలా ఎందుకు చేస్తున్నాయో అర్థం కావడం లేదు, కనీసం సిరివెన్నెల సీతారామశాస్త్రి పేరును కూడా పద్మ అవార్డులకు ప్రతిపాదించలేదు. నన్ను టోటల్ గా డిసప్పాయింట్ చేసింది. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు వినిపించే వరకు గొంతు కలుపుదాం. నా వాదన రైట్ అనిపిస్తే మీడియా వారు కూడా మాతో జాయిన్ అవ్వండి అంటూ’ అని తెలిపారు.