‘చిలసౌ’ రుహానీ…ఆ ‘టైప్’ కాదట!

0సినీ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ చాలాకాలంగా నడుస్తోంది. ఏదన్నా ఒక సినిమాలో తెరంగేట్రం చేసిన హీరోయిన్ పాత్రకు మంచి గుర్తింపు వస్తే….ఆ తర్వాత కూడా ఆమెకు అదే తరహా ఆఫర్స్ వస్తుంటాయి. కొన్నాళ్లకు ప్రేక్షకులు….ఆ తరహా పాత్రల్లో ఆమెను చూడలేకపోవడం…లేదా వరుస ఫ్లాపులు పలకరించడం వంటివి జరిగే వరకు ఆ రోల్స్ కొనసాగుతుంటాయి. తెలుగు ప్రేక్షకులను తన అందం – అభినయంతో `ఫిదా` చేసిన పింపుల్స్ బ్యూటీ సాయి పల్లవి ఇందుకు ఉదాహరణ. అయితే ఈ మలయాళ భామ ….ఇప్పటివరకు మంచి పాత్రలను దక్కిచుకుని దూసుకుపోవడం విశేషం. `ఆర్ ఎక్స్ 100` లో నటించిన పాయల్ రాజ్ పుత్ కు అదే తరహా రోల్స్ వస్తే….సున్నితంగా రిజెక్ట్ చేసింది. తాజాగా చిలసౌ హీరోయిన్ రుహానీ శర్మకు కూడా అదే సమస్య వచ్చింది. దీంతో తాను స్టీరియో టైప్ కాదని మెసేజ్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఈ అమ్మడు…హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

చిలసౌలో రుహానీ …సాదాసీదాగా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. సాయి పల్లవి లాగే….ఈ సినిమాలో రుహానీ…పెద్దగా మేకప్ లేకుండానే పింపుల్స్ తో న్యాచురల్ లుక్ లో కనిపించింది. ఈ సినిమాలో ఆమె రోల్ కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇకపై కూడా తనకు ఆ తరహా రోల్స్ వస్తాయేమోనని రుహానీ తెగ భయపడుతోందట. అందుకే తాను స్టీరియో టైప్ కాదని….ఏ తరహా రోల్స్ చేసేందుకైనా రెడీ అని మెసేజ్ ఇచ్చింది. తాజాగా హాట్ లుక్స్ తో ఉన్న తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఆ ఫొటోలు…సర్క్యులేట్ అయ్యేలా ప్రమోట్ చేస్తోందట. మరి ఈ అమ్మడి ప్రయత్నాలు ఫలించి…ఆమెకు డిఫరెంట్ రోల్స్ వస్తాయా…లేక స్టీరియోటైప్ కే పరిమతమవుతాయా అన్నది తేలాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.