ఫర్హాన్ అక్తర్ లవ్ స్టోరీ.. ఆమె ఎవరంటే!

0సినిమా పరిశ్రమలో రీల్ లవ్ స్టోరీలు మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లవ్ స్టోరీలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. బాలీవుడ్ లో లవ్ స్టోరీలు – లివింగ్ రిలేషన్ షిప్ లు ఇంకా పలు రకాల అఫైర్లు చాలా కామన్ అనే విషయం తెలిసిందే. బాలీవుడ్ కు చెందిన ఎక్కువ శాతం సెలబ్రెటీలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం మనం ఈమద్య గమనించవచ్చు. తాజాగా ప్రముఖ నటుడు – దర్శకుడు అయిన పర్హాన్ అక్తర్ కూడా ప్రేమలో ఉన్నట్లుగా తేలిపోయింది. కొన్నాళ్ల క్రితం తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన ఈయన రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

తాజాగా పర్హాన్ అక్తర్ ప్రేయసి ఎవరో తెలిపోయింది. ఈయన ప్రేమిస్తున్న ముద్దుగుమ్మ మరెవ్వరో కాదు ఐపీఎల్ యాంకర్ – హాట్ బ్యూటీ షిబానీ దండేకర్. ఈ అమ్మడు యాంకర్ అయినప్పటికి హీరోయిన్ కంటే ఎక్కువ రొమాంటిక్ గా కనిపిస్తూ బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే షిబానీ మోడలింగ్ లో కూడా రాణిస్తూ ఉంది. తాజాగా ఈమె పర్హాన్ తో ప్రేమలో ఉన్నట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా క్లారిటీ వచ్చేస్తోంది.

పర్హాన్ ఈ విషయమై చెప్పకుండానే తెలిసేలా లీక్ ఇచ్చాడు. ఒక ఫొటోను లీక్ చేసిన పర్హాన్ తమ ప్రేమ కథను మెల్ల మెల్లగా రివీల్ చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. గత రెండు సంవత్సరాలుగా షిబానీ దండేకర్ తో రిలేషన్ షిప్ ను కొనసాగిస్తున్న పర్హాన్ అక్తర్ త్వరలోనే ఆమెను వివాహం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడు పదుల వయస్సు దాటిన షిబానీకి పర్హాన్ అక్తర్ కు మంచి జోడీ కుదురుతుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతుంది. ఈ జంట వివాహం కోసం బాలీవుడ్ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.