తమన్నాకు ఎందుకిలా జరుగుతుంది?

0tamanna-in-baahubaliకావల్సినంత గ్లామర్ దారబోసింది. బ్యాక్ లెస్ గా కూడా నటించేసింది. అందుకే బాహుబలి తరువాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది. అయితే అనివార్య కారణాల వలన ఈ అవంతకి 2వ భాగంలో కనిపించలేదు. కేవలం ఒకసారి అలా మెరిసి ఆఖర్లో మరోసారి మరోలా మెరిసింది. మనం చూడకపోతే మిస్సయిపోతుందేమో అనేంత తక్కువ స్ర్కీన్ టైమ్ ఆమెకు దక్కింది.

అయితే ఈ కారణంగా మిల్కీ సైరన్ తమన్నా బాటియా ఫీలవుతుందో లేదో తెలియదు కాని.. ఆ తరువాత వస్తున్న వార్తలు మాత్రం ఆమె అభిమానులను నొప్పిస్తున్నాయి. ఆ మధ్యన జూ.ఎన్టీఆర్ లవకుశలో తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నారు అన్నారు. కట్ చేస్తే రాశి ఖన్నా అండ్ నివేదా థామస్ అక్కడ తేలారు. ఇప్పుడు ప్రభాస్ సాహో సినిమాలో మరోసారి బాహుబలితో అమ్మడు జతకడుతోంది అంటూ వార్తలొచ్చాయి. కాని స్వయంగా ఆ ప్రొడక్షన్ హౌస్ కు చెందినవారే వాటిని ఖండించారు. మొత్తానికి సినిమాలేవీ ఈమె ఖాతాలో పడట్లేదు అన్నట్లు రోజుకో న్యూస్ తమన్నాతో ఆడేసుకుంటోంది అంతే.

వాస్తవానికి తమన్నా చేతిలో కూడా తమిళంలో విక్రమ్ సినిమా తప్పిస్తే.. అసలు వేరే సినిమాయే లేదు. ఇప్పటివరకు అమ్మడు తమిళంలో నటనపరంగా ప్రాముఖ్యత ఉన్న పాత్రలను ఎన్ని చేసినా పేరు రాలేదు.. కేవలం గ్లామర్ మాత్రమే వారు ఆదరించారు. ఇప్పుడు తమన్నా కెరియర్ ఎలా ఉండబోతుంది అంటారు. లెటజ్ సీ.