సామి స్క్వేర్ ట్రైలర్ టాక్: ఈ పోలీసు మహా పోకిరి సామి!

0సింగం’ సీరీస్ తో పాపులర్ అయిన తమిళ దర్శకుడు హరి ఈసారి విక్రమ్ తో’సామి'(తమిళంలో ‘సామి స్క్వేర్’) అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ట్రైలర్ నిన్నే రిలేజ్ అయింది. రెండు నిమషాలా పది సెకన్లు నిడివిగల ఈ ట్రైలర్ లో సినిమా ఎలా ఉంటుందో అనే విషయాన్ని డైరెక్టర్ హరి క్లియర్ గా చూపించాడు. ‘సామి’ హరి స్టైల్ లో సాగిపోయే ఊర మాస్ డబల్ మసాలా ఎంటర్టైనర్.

సాధారణ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాలకు భిన్నంగా హరి సినిమాలు జెట్ స్పీడ్ తో సాగిపోతుంటాయి. మనం కళ్ళుమూసుకుని ఆఫీసులో మిగిలిన పనిని గుర్తుచేసుకునే రెండు క్షణాల్లో ఒక సీన్ అయిపోయి ఉంటుంది. ‘సామి’ కూడా అంతే. ట్రైలర్ స్టార్ట్ అయిన వెంటనే రౌద్రంగా డైలాగ్ చెప్తూ లాస్ట్ లో ‘పరశురామ స్వామి’ అంటూ పోలీస్ యూనిఫాం లో ఉన్న విక్రమ్ గొంతు చించుకొని అరుస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే పోలీస్ స్టేషన్ బయట ఒకడ్ని కొడితే వాడు ఎగిరి ఇరవై అడుగుల దూరంలో పడతాడు. ఇక వెంటనే హీరోయిన్ కీర్తి సురేష్ ను చూపించారు.. విక్రమ్- కీర్తి లవ్ సీన్లు.. కమెడియన్ సూరి కామెడి సీన్ ఒకటి. హీరోయిన్ ను మళ్ళీ కాసేపు పక్కన బెట్టి సుమోలు..ఛేజింగులు.. హెలికాప్టర్ అన్నీ వస్తాయి. ఇక దేవీ ట్యూన్స్ కు ఫారిన్ లోకేషన్స్ లో విక్రమ్-కీర్తి స్టెప్పులు.

టోటల్ ట్రైలర్లో స్టాండ్ అవుట్ గా నిలిచేది బాబీ సింహా ఇంట్రో.. మర్డర్ చేసి స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళడం. “పది తలలు ఉన్న రాక్షస రాజుని” అని బాబీ సింహా అంటే నెక్స్ట్ షాట్ లో విక్రమ్ “నాకు కావలసింది మూడు తలలు’ అంటూ ముగ్గురిని కొడతాడు. ఈ షాట్లు మాస్ ఆడియన్స్ ను మెప్పించేవే. లాస్ట్ డైలాగ్ ‘నేను పోలీస్ కాదు పోకిరి’ అని మళ్ళీ పెద్దగా గొంతు నొప్పి పుట్టేలా అరుస్తాడు. విక్రమ్ యాక్టింగ్ గురించి అందరికీ తెలిసిందే కాబాట్టి మళ్ళీ స్పెషల్ గా ఆ టాపిక్ ప్రస్తావించనవసరం లేదు. ఇక ఇలాంటి సినిమాలకు సంగీతం అందించడం లో దేవి దిట్ట.. ఓ సరిగమల పుట్ట.

ఓవరాల్ గా కమర్షియల్ మీటర్ లో హరి ఫిక్స్డ్ ఫార్మాట్ లో ఉంది ఈ ‘సామి’.. మీరు కూడా ఓ లుక్కేయండి సామీ!