సబా పాపకు సంస్కారుల బెదిరింపులు!

0‘సంస్కారం’ ఏంటి అంటే.. ఒక్కోరు ఒక్కో సమాధానం చెప్తారు. మన దర్శక దిగ్గజం రామ్ గోపాల్ వర్మ సంస్కారం వేరు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంస్కారం వేరు.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ది మరో విధమైన సంస్కారం. ఎప్పుడు వార్తల్లో ఉండేవారికేనా.. సభ్య సమాజంలో ఉన్న నెటిజనులకు సంస్కారం ఉండదా ఏంటి? వాళ్ళకు కూడా ఉంటుంది. అలాంటి సంస్కారంతోనే వాళ్ళు ఎవరికైతే సంస్కారం ఉండదని అనుకుంటారో వాళ్ళను ఎంతో సభ్యతతో విమర్శిస్తారు. దాన్నే ఆంగ్ల భాషలో ట్రోలింగ్ అంటారు.

ఈమధ్య ఇలాంటి నెటిజనులు ‘హిందీ మీడియం’ అనే బాలీవుడ్ సినిమాలో నటించిన సబా కమర్ అనే పాకిస్తాన్ నటిని ట్రోలింగ్ చేస్తున్నారు.. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏంటి? ఆమెకు సంబంధించిన రెండు ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఒక ఫోటోలో ఆమె హాటుగా ఉంది.. ఇంకో ఫోటోలో సిగరెట్టుతో ఉంది. అంతే..అదే ఆమె చేసిన నేరం. దెబ్బతో అమెకు పాకిస్తానీ సంస్కారుల నుంది బెదిరింపులు ఎదురయ్యాయి. “సిగరెట్ తాగడమే తప్పు.. పైగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తావా?”.. “అసలు నువ్వు ముస్లింవేనా.. నువ్వు కూడా మహీరా ఖాన్ లా తయారవుతున్నావా?” అంటున్నారు. కొంతమంది ఇంకా దూరం వెళ్లిమరీ బెదిరించారు.

అలా అని అందరూ అలానే ఉండరు కదా. కొంతమంది ఉదారుభావాలు కలిగిన వారు కూడా ఉంటారు. వాళ్ళు సబా ను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అది ఆమె ప్రైవేటు వ్యవహారమని తిరిగి కౌంటర్ ఇచ్చారు.