మార్డ్ కోసం పాట పాడనున్న సచిన్

0



బాలీవుడ్ కి చెందిన ఫేమస్ డైరెక్టర్ కమ్ నటుడు అయిన ఫర్హాన్ అక్తర్ మహిళలపై జరుగుతున్నా అత్యాచారాలను ఆపడానికి తన వంతు ప్రయత్నంగా అందరిలోనూ చైతన్యం తీసుకు రావాలనే ఉద్దేశంతో ‘మార్డ్(MARD)’ అనే ఒక ఆర్గనైజేషన్ ని ప్రారంభించాడు. మహిళలు ఎదుర్కొంటున్న మాన భంగం, విక్షతకు వ్యతిరేఖంగా పురుషులు ప్రవర్తించాలన్నది మార్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మార్డ్ ద్వారా అసలు మనం ఏమి చెయ్యాలి అనేదాని పైన ఓ గీతాన్ని రచించారు. ఇప్పటికే ఈ గీతాన్ని హిందీలో ఫర్హాన్ అక్తర్, తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆలపించారు.

ఇలా ఒమంచి ఉద్దేశంతో ప్రారంభించిన మార్డ్ లో ప్రపంచం గర్వించదగిన క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా వచ్చి చేరారు. ఆయన కూడా ఈ సంస్థలో ఆయన కూడా ఒక భాగమయ్యారు. మార్డ్ స్పెషల్ గీతాన్ని మరాఠీలో సచిన్ పాడనున్నారు. ఈ విషయంలో ఫర్హాన్ అక్తర్ ఎంతో సంతోషంగా ఉన్నారు.

తెలుగులో మహేష్ బాబు పాడిన ‘మార్డ్’ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి..

sachin song for mard, మార్డ్ కోసం పాట పాడనున్న సచిన్