సినిమాల్లోకి సచిన్‌ గారాలపట్టీ..!

0



Sara-Tendulkarమాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ కుమార్తె సారా తెందుల్కర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతోంది. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ సారాను బాలీవుడ్‌కు పరిచయం చేయనున్నారట.

సినిమా రంగంలోకి రావాలని సారాకి చిన్నప్పటి నుంచి కోరిక ఉండేదటఅందుకు ఇదే సరైన సమయమని భావించిన ఆమిర్‌ ఆమె చిత్ర పరిశ్రమకు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. అంతేకాదు.. ఆమె తొలి సినిమాలోనే రణ్‌బీర్‌ కపూర్‌తో కానీ రణ్‌వీర్‌ సింగ్‌తో కానీ కలిసి పనిచేయనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

సారా ధీరూబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుకుంది. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు సచిన్‌, అంజలితో కలిసి సారా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. సమాజ సేవలు చేయడంలోనూ సారా ఎప్పుడూ ముందుంటుంది.