ఒక్క ఫైట్ కోసం రూ. 40 కోట్ల ఖర్చు..

0యాంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ – సుజిత్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సాహో.. ఈ నెల 15 నుండి దుబాయ్ లో షూటింగ్ జరుపుకోబోతుంది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నీ వేషాలు చిత్రీకరించబోతున్నారు. బుర్జ్ క‌ల్ఫియా, రాస్ అల్ కైమా, వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ ప్రాంతాల‌లో ప్ర‌భాస్‌పై చేజింగ్ సీన్స్ తీయ‌నున్నార‌ట‌. ఈ యాక్షన్ సన్నివేశం కోసం అబుదాబిలో 300 మంది టీంతో భారీ సెట్ నిర్మిస్తున్నాడ‌ట‌ సాబు సిరిల్.

బాహుబ‌లి సినిమాలో భారీ సెట్స్ నిర్మించిన సాబు గ‌త ఆరు నెల‌లుగా అబుదాబిలో ప‌ర్య‌టించి అక్క‌డి ప‌రిస్థితుల‌క‌నుగుణంగా 40 కోట్ల భారీ బడ్జెట్‌తో భారీ సెట్ నిర్మిస్తున్నార‌ట‌. ఈ సెట్ కోసం ఇండియా నుండి 300 మందిని అబుదాబికి పంపించార‌ట‌. ఇందులో పేయింటర్లు, మౌల్డర్స్, కార్పెంటర్స్, వెల్డర్స్, డిజైనర్స్ తదితరులు ఉన్నార‌ని తెలుస్తుంది. ఇక సెట్స్ వేయడానికి కావాల్సిన సామాగ్రిని 4 కంటైనర్లలో షిప్స్ ద్వారా ఇండియా నుండి అబుదాబి తరలించారు. ఈ భారీ యాక్షన్ సన్నివేశం సినిమాకే హైలైట్ కాబోతుందని చిత్ర వర్గాలు తెలియజేస్తున్నాయి. యూవీ క్రియేషన్ బ్యానర్ ఫై ఈ మూవీ నిర్మించబడుతుండగా , బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.