సాహో టీమ్ హోటల్ బిల్లే అంత అవుతోందా…

0రిలీజ్ తరువాత సాహో ఎన్ని రికార్డుల కలెక్షన్స్ కొల్లగొడుతుందో గాని ఏ మాత్రం తేడా వచ్చినా యూవీ క్రియేషన్స్ కి ఊహించని అనుభవం ఎదురవుతుంది. ఎన్ని కామెంట్స్ వచ్చినా కూడా నిర్మాతలు ఏ మాత్రం తగ్గడం లేదు. స్క్రిప్ట్ మీద నమ్మకం. ప్రభాస్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని కోట్లు గుమ్మరిస్తున్నారు. యువీ క్రియేషన్స్ ఇప్పటి వరకు ఏ సినిమాతో నష్టపోలేదు. వచ్చిన లాబలాన్ని ఈ సినిమా కోసమే ఇన్వెస్ట్ చేసేస్తున్నారు.

30 ఏళ్ళు కూడా లేని దర్శకుడు సుజీత్ చేతిలో 200 కోట్ల భారీ బడ్జెట్ సినిమా అంటే ఇండస్ట్రీలో సీనియర్ దర్శకులే షాక్ అయ్యారు. అయినా మనోడి కష్టం డెడికేషన్ కూడా ఆ లెవెల్లో ఉందట లెండి. సినిమా క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేది లేదని అటు నిర్మాత ఇటు దర్శకుడు ఒకే ట్రాక్ లో ఆలోచిస్తున్నారు. ఇక దుబాయ్ లో యాక్షన్ సీన్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. 100 ల మంది టీమ్ తో చాలా కాస్ట్లీ ఏరియాలో సాహో టీమ్ షూటింగ్ చేస్తోంది.

హాలీవుడ్ అంచనాలకు తగ్గకుండా చేస్తున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయట. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. టీమ్ కు అక్కడ వసతి ఏర్పాట్లు చేయడంలోనే సగంలో సగం డబ్బు ఎగిరిపోతోందట. హోటల్ బిల్లులే 15 కోట్లు అవుతోంది అంటే అర్ధం చేసుకోవచ్చు ఏ లెవెల్లో ఉందొ.. ఆ డబ్బుతో ఓ మీడియం హీరోతో మంచి సినిమా చేయవచ్చు. పగలు రాత్రి తేడా లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారట. ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ ను ఫినిష్ చేసి ఆ తరువాత ఎమోషన్ కి సంబందించిన సీన్స్ ను ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.