మెగా స్టార్ తో సుప్రీం హీరో

0saidarm-tej-with-chiruమెగా ఫ్యామిలీ హీరోలకు మెగాస్టారే కేరాఫ్‌ అడ్రస్‌, అందుకే ఎవరు ఎంత ఎదిగినా.. చిరంజీవి వారసులుగానే తమను గుర్తించేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా మెగా మేనల్లుడిగా వెండితెరకు పరిచయం అయిన సాయి ధరమ్‌ తేజ్‌ చాలా సందర్భాల్లో మెగాస్టార్‌ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తాజాగా ఓ ఆసక్తికరమైన ఫోటోతో మామయ్య మీ ప్రేమను అభిమానాన్ని ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకున్నాడు. చిన్నారి సాయి ధరమ్‌ తేజ్‌ను తన ఒడిలో కూర్చోపెట్టుకున్న మెగాస్టార్‌ చిరంజీవి ఫొటోనూ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్‌ చేశాడు సాయి.

ఈ ఫొటోతో పాటు ‘జీవితం, వృత్తి పట్ల నిబద్ధతగా ఉండేందుకు నాకు స్ఫూర్తి, ప్రేరణ చిరంజీవిగారు’ అంటూ కామెంట్‌ చేశాడు సాయి ధరమ్‌ తేజ్‌. ఇటీవల వరుస ఫ్లాప్‌ లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌, ప్రస్తుతం రచయిత బీవీయస్‌ రవి తెరకెక్కిస్తున్న జవాన్‌ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి సరసన మెహరీన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది.