మేనల్లుడులో ఆ మార్పు ఎందుకు?

0ప్రతి ఒక్కరిలో రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చేసిన తప్పేంటో తెలిస్తే వాటి నుంచి బయట పడేందుకు కొత్త దారి వెతుక్కోవచ్చు. అయితే ఆ రియలైజేషన్ ఎంత వేగంగా ఉంటే అంత మంచి జరుగుతుంది. కానీ మెగా మేనల్లుడు సాయిధరమ్ విషయంలో అలాంటిది ఇన్నాళ్లు లేనేలేదన్న విమర్శ ఉంది. సాయిధరమ్ పదే పదే ఫ్లాప్ దర్శకులకు అవకాశాలిచ్చాడు. మొహమాటాలకు పోయి కమిట్ మెంట్ పై నిలబడ్డాడు. దాని ఫలితమే అన్ని ఫ్లాపులు మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయినా మొక్కవోని ధీక్షతో ఆ ఒక్క హిట్టు కోసం పాకులాడుతున్నాడు.

ఇకపోతే సాయిధరమ్ వ్యక్తిత్వం గురించి తెలిసిన దర్శకనిర్మాతలు అతడికి మరింత చేరువవుతూ ఫ్లాపుల్లో ఉన్నా అవకాశాలివ్వడం ఇటీవల చర్చకొచ్చింది. తన పని తాను సిన్సియర్ గా చేస్తున్నాడు. కానీ సక్సెస్ ముఖం చాటేస్తోంది. కథల ఎంపిక – దర్శకుల ఎంపికలో సాయిధరమ్ ఏదో తప్పు చేస్తున్నాడా? అన్న సందేహాల్ని రాజేసింది ఫ్లాప్ ల రిజల్ట్. దాంతో పాటే అతడు నటించిన గత చిత్రం `తేజ్ .. ఐ లవ్ యు` మరికొన్ని కొత్త పాఠాల్ని మేనల్లుడికి నేర్పించిందిట.

ఇన్నాళ్లు తన ఫిజికల్ అప్పియరెన్స్ విషయంలో కాన్ఫిడెంట్గా ఉండేవాడు సాయిధరమ్. కానీ ఇటీవల కేరింగ్ తగ్గడంతో కాస్తంత లుక్ పరంగా తేడా కనిపించిందని క్రిటిక్స్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ సన్నివేశాన్ని సీరియస్ గా తీసుకున్న సాయిధరమ్ ఏకంగా అమెరికా వెళ్లి అక్కడ ఓ ఫిజికల్ ట్రైనర్ వద్ద కసరత్తులు చేసి రూపం మార్చుకున్నాడట. ప్రస్తుతం కిలోల కొద్దీ బరువు తగ్గి పూర్తిగా స్లిమ్ అయిపోయాడట. మారిన ఈ కొత్త రూపం చూపించేందుకు మరో వారంలో ఇక్కడ దిగిపోతున్నాడని తెలుస్తోంది. `నేను శైలజ` – `ఉన్నది ఒకటే జిందగీ` చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల వినిపించిన లైన్కి సాయిధరమ్ ఓకే చెప్పాడని ప్రచారమైంది. ఈ సినిమా చిత్రీకరణకు అతడు రెడీ అవుతున్నాడట.