విన్నర్ డబ్బింగ్ స్టాట్ చేసిన తేజ్!

0winner-lookఒక్కో సినిమాతో తన స్థాయి పెంచుకుంటూ వెళుతోన్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా ‘విన్నర్’ అనే ఓ కమర్షియల్ సినిమాతో వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరో స్టేటస్ కొట్టేసిన సాయిధరమ్ తేజ్, ఈ సినిమాతో ఆ స్టార్‌డమ్‌ను మరింత పెంచుకునే దిశగా కష్టపడుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోగా సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుపుకుంటోంది.

నేడు హైద్రాబాద్‌లో సాయిధరమ్ తేజ్ తన పాత్రకు డబ్బింగ్ మొదలుపెట్టేశారు. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ సమాంతరంగా నిర్వహిస్తూ ఫిబ్రవరి నెలాఖర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.