నిర్మాతగా మహానటి రచయిత

0రచయితల కోసం ప్రస్తుతం కొంత మంది బడా దర్శకులు చాలా ఎదురుచూస్తున్నారు. కానీ రైటర్ లు మాత్రం దర్శకత్వంపై అడుగులు వేస్తూన్నారు. ప్రస్తుతం రచయితల సంఖ్య బాగా తగ్గుతోంది. అయితే కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాల కోసం ఇప్పుడు అందుబాటులో సాయి మాధవ్ బుర్ర మాత్రమే ఉన్నారని చెప్పాలి. దర్శకుడు క్రిష్ సపోర్ట్ తో కృష్ణ వందే జగద్గురుమ్ – కంచె అలాగే గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలకు డైలాగ్స్ అందించారు.

ఆ సినిమాలతో మంచి గుర్తింపు రావడంతో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. రీసెంట్ గా మహానటి కి కూడా మాటలను అందించి తన కలం బలాన్ని చూపించారు. అయితే ఇప్పుడు ఇలాంటి రచయిత నిర్మాతగా మారనున్నారట. అంటే సినిమా నిర్మాతగా కాదు. వెబ్ సిరీస్ ను నిర్మించాలని అనుకుంటున్నారట. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక రైటర్ వెబ్ సిరీస్ లకు టర్న్ అవ్వడం ఇదే మొదటి సారి. తనే ఆ వెబ్ సిరీస్ కు రైటర్ గా ఉండాలని అనుకుంటున్నారు.

ఇక సాయి మాధవ్ బుర్ర దర్శకుడిగా మారె అవకాశం ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన మనస్సు నుంచి మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి న్యూస్ రాలేదు. ప్రస్తుతం సాయి మాధవ్ మెగాస్టార్ చిరంజీవి – సైరా సినిమాకు మాటలు అందిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ కి కూడా డైలాగ్సి రాస్తున్నారు. ఇప్పటికే ఆ వర్క్ ఎండింగ్ కు వచ్చినట్లు తెలుస్తోంది.