సాయి పల్లవి అందుకే మేకప్ వేసుకొదట

0ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా ఫ్యాన్స్ ఏర్పడటం చాలా అరుదు. కానీ సాయి పల్లవి విషయంలో జరిగిపోయింది. మలయాళం ప్రేమమ్ తో స్టార్ అయిపోయింది సాయి. ఈ సినిమాని మలయాళంలో చూసి ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు మిగతా సినీ జనాలు. ఫిదాతో టాలీవుడ్ కి వచ్చింది పల్లవి. ఇది ఆమెకు మొదటి తెలుగు సినిమా. అయితే ఆల్రెడీ ప్రూవ్ అయిన హీరోకి వచ్చినంత అప్లాజ్ వచ్చింది . ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. అయితే సాయి పల్లవికి ఇంకో క్యాలిటీ కూడా వుంది. ఆమె మేకప్ వేసుకోదు.

దిని గురించి తాజాగా ఆమె మాట్లాడుతూ.. తన తొలి సినిమా ‘ప్రేమమ్‌’ దర్శకుడు ఆల్ఫోన్స్‌ ‌ పుతెరిన్‌‌ దీనికి కారణమని , సహజంగా నటించమని ఆయన ప్రోత్సహించినట్లు చెప్పింది. ఆయనే కాదు తను కలిసి పనిచేసిన అందరు దర్శకులూ తన ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడ్డారని, అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి కూడా ఇలా చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది సాయి పల్లవి.