షూటింగ్ లో సూర్యను చాలా ఇబ్బంది పెట్టిందట

0

మలయాళి ముద్దుగుమ్మ సాయి పల్లవి సౌత్ లో దూసుకు పోతుంది. మలయాళంతో పాటు తెలుగు మరియు తమిళంలో కూడా ఈమె స్టార్ హీరోలకు జోడీగా నటిస్తోంది. తమిళంలో తాజాగా ఈమె సూర్య హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎన్ జీ కే’ చిత్రంలో నటించింది. మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఎన్ జీ కే’ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంను తాజాగా నిర్వహించారు. తమిళంతో పాటు తెలుగులో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ చిత్రం అంచనాలను ట్రైలర్ మరింతగా పెంచింది. ఇక ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ హీరో సూర్య పై ప్రశంసల వర్షం కురిపించింది.

సాయి పల్లవి మాట్లాడుతూ.. నేను సూర్య గారికి వీరాభిమానిని ఆయన్ను షూటింగ్ సమయంలో ఎక్కువగా గమనిస్తూనే ఉండేదాన్ని. ఆయన ఏం చేసినా కూడా నా దృష్టి ఆయనపై ఉండేది. ఆయన సెట్ లో అందరితో కలివిడిగా మాట్లాడుతూ వారి ఇంట్లో వారి గురించి కూడా అడుగుతూ ఉండేవారు. షాట్ రెడీ అనగానే ఆయన రెడీ అయ్యే తీరు షాట్ లో ఉన్న సమయంలో ఆయన సీరియస్ నెస్ ఇంకా ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించేదాన్ని. నేను ఊరికే ఆయన్ను చూస్తూ ఉంటే ఆయన ఇబ్బంది పడి ఉంటారు.

నేను మరో 20 ఏళ్లు సినిమా ఇండస్ట్రీలో చేసినా కూడా ఆయన అంత కష్టపడలేను ఆయన ఏ పాత్ర చేసినా కూడా ఒదిగి పోతారు. అలాంటి వ్యక్తితో నేను నటించాను అంటే నమ్మకంగా లేదు. చాలా సంతోషంగా అనిపించింది. షూటింగ్ సమయంలో ఒక సీన్ కోసం 50 టేకుల వరకు తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో సూర్య గారు విసుక్కోకుండా నేను ఇబ్బంది పడకుండా చూసుకున్నారు. ఓపికగా ఆ సీన్ ఓకే అయ్యే వరకు చేశారని సూర్యతో తన వర్క్ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకుంది. షూటింగ్ సమయంలో సూర్య గారు నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కూడా ఆయన ఎప్పుడు నాపై కోపం ప్రదర్శించలేదు ఓపికతోనే ఉన్నారని సరదాగా కామెంట్ చేసింది.
Please Read Disclaimer