తల్లయిన సాయి పల్లవి

0ఈమెకింకా పెళ్లి కాలేదు. అప్పుడే తల్లి ఏంటి ?! దిని మేటర్ వేరు. దీనికి కారణం కణం సినిమా. ఈ సినిమాలో ఓ చిన్నారికి తల్లిగా నటించింది సాయిపల్లవి. భ్రూణ హత్యలు, ఆ పిండం ఆత్మగా మారి తల్లిని చేరడం లాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కింది కణం. మార్చిలో విడుదలకానున్న ఈ సినిమా తన కెరీర్ లో వెరీవెరీ స్పెషల్ అంటోంది సాయిపల్లవి.

“ఫస్ట్ టైం నేను తల్లినయ్యాను. మాతృత్వం ఎలా ఉంటుందో ఓ చిన్నారితో ఎటాచ్ మెంట్ ఏర్పడితే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలిసొచ్చింది. కంప్లీట్ గా తల్లీకూతుళ్ల చుట్టూ తిరిగే కథ ఇది. ఎప్పుడైతే సెట్స్ లో వెరోనికా(చిన్నపిల్ల)తో పాటు గడపడం ప్రారంభించానో నిజంగానే తల్లినయ్యాననే ఫీలింగ్ వచ్చేసింది. ప్రస్తుతం వెరొనికా లేకుండా ఉండలేకపోతున్నాను” అని చెప్పుకొచ్చింది సాయి పలవి. ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య హీరో.