సాయిపల్లవి గొడవలో నిజమెంత?

0ఫిదా బ్యూటీ సాయిపల్లవి హీరోలతో గొడవ పెట్టుకోవడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇదివరకూ `కణం` చిత్రీకరణ సమయంలో హీరో నాగశౌర్యతో సాయిపల్లవి పొగరుగా ప్రవర్తించిందని ఆ క్రమంలోనే ఆ ఇద్దరి మధ్యా మాటల్లేకుండా పోయాయని ప్రచారమైంది. అది గతం అనుకుంటే మరోసారి సేమ్ టు సేమ్ రూమర్ తనపై వినిపించింది.

గత కొంతకాలంగా కోల్ కతాలో `పడి పడి లేచే మనసు` చిత్రీకరణ సాగుతోంది. శర్వానంద్ – సాయి పల్లవి బృందం చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే ఆన్ లొకేషన్ శర్వాతో సాయిపల్లవి చికాగ్గా ప్రవర్తించిందని – సాయిపల్లవి ప్రవర్తన శర్వాని షాక్ కి గురి చేసిందని ప్రచారం సాగింది. కోల్ కతా నుంచే ఈ రూమర్ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఇదే విషయం ప్రశ్నిస్తే.. యూనిట్ సభ్యులు అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చారు. సాయిపల్లవి గత వారం రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతోంది. అయితే ఈ షెడ్యూల్ పెద్ద రేంజులో ప్లాన్ చేయడంతో ఎందరో టాప్ స్టార్లు నటిస్తున్నారు. సదరు స్టార్ల కాల్షీట్లు వృధా కాకూడదంటే జ్వరంతోనే సాయి పల్లవి నటించాల్సిన పరిస్థితి ఉందిట. అందుకు తను ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా సహకరించిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. జ్వరం వచ్చిన మాట మాత్రం వాస్తవం. ఇతర రూమర్లేవీ సరికాదని తేల్చేశారంతే.