భయపెట్టబోతున్న ఫిదా భామ..

0ఫిదా , మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి , ఇప్పుడు హర్రర్ నేపథ్యం లో సాగే కథ తో భయపెట్టబోతుంది. కేవలం భయపెట్టడం మాత్రమే కాదట కాస్త రొమాన్స్ కూడా పంచబోతుంది ఈ ఫిదా భామ. తమిళ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. నిత్య మేనన్ మరో హీరోయిన్ గా తీసుకోబోతున్నారనే వార్త వినిపిస్తుంది.

ఇప్పటి వరకు సాయి పల్లవి పక్కింటి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయి కనిపించింది. తనదయిన నటనతో , డాన్సులతో ఆకట్టుకున్న ఈమె , ఇప్పుడు ఎలా భయపెడుతుందో అని అంత అనుకుంటున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజ సంగీతం అందిస్తున్నారు. మిగతా కాస్ట్ & క్రూ వివరాలు , సినిమాకు సంబదించిన విశేషాలు త్వరలోనే తెలియజేస్తారట.