అప్పుడు సాయి పల్లవి ఏడ్చేసిందట

0

‘ప్రేమమ్’ చిత్రంతో మొత్తం సౌత్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఆ చిత్రం తర్వాత తెలుగు మరియు తమిళంలో సాయి పల్లవి బిజీ అయ్యింది. సూపర్ హిట్స్ తో పాటు ఫ్లాప్ లను కూడా ఈమె దక్కించుకున్నా కూడా నటిగా మాత్రం సినిమా సినిమాకు పరిణితి పెంచుకుంటూనే పోతూ ఉంది. తాజాగా ఈమె తమిళ స్టార్ హీరో సూర్యకు జోడీగా ‘ఎన్జీకే’ చిత్రంలో నటించింది. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు సాయి పల్లవి ఈ చిత్రంలో నటించింది. సూర్యకు భార్య పాత్రలో సాయి పల్లవి నటించింది.

సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి హీరో సూర్య మాట్లాడుతూ.. సాయి పల్లవి చాలా కష్టపడి నటిస్తుంది. ప్రతి సీన్ లో కూడా తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయతిస్తుంది. రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కొన్ని సీన్స్ చాలా డెప్త్ గా ఉంటాయి. ఆ సీన్స్ లో ముఖ్య నటీనటులం అయిన మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ సమయంలో సాయి పల్లవి ఒక సీన్ చేయాల్సి వచ్చింది. ఆ సీన్ అనుకున్న విధంగా రాకపోవడంతో సాయి పల్లవి ఏడ్చేసింది. తాను ఆ స్థాయిలో చేయలేక పోతున్నాను అనే బాధ ఆమెకు కలిగింది.

సీన్ సరిగా రాకపోవడంతో ఏడ్చేసిన హీరోయిన్ ను ఇప్పటి వరకు చూడలేదు. తాను చేయలేక పోతున్నానే అనే బాధ ఆమెలో కనిపించింది. ఆ సంఘటన ఆమెకు సినిమాపై ఎంత ఆసక్తి ఉందో చెప్పకనే చెబుతుందని సూర్య అన్నాడు. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలో నేను దర్శకుడు సెల్వ రాఘవన్ నుండి చాలా నేర్చుకున్నాను అన్నాడు. మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై తమిళ సినీ ప్రేక్షకుల్లోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.
Please Read Disclaimer