పండగ రోజు అల్లుడి జోరు

0మంచి అంచనాల మధ్య విడుదలైన నాగ చైతన్య శైలజారెడ్డి అల్లుడు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓపెనింగ్స్ రాబట్టుకుంది. టాక్ ఎలా ఉందనేది పక్కన పెడితే చైతు కెరీర్ లో హయ్యస్ట్ ఓపెనర్ గా నిలవడంలో శైలజారెడ్డి అల్లుడు సక్సెస్ అయ్యాడు. పండగ సెలవు అనే కారణంతో గురువారం విడుదలైన ఈ మూవీకి సమంతా యుటర్న్ తప్ప పెద్దగా పోటీ లేకపోవడం బాగా కలిసి వచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి రోజు షేర్ సుమారు 5.50 కోట్ల దాకా వచ్చినట్టు ట్రేడ్ సమాచారం. ఇది గీత గోవిందం మొదటి రోజు షేర్ కన్నా కాస్త ఎక్కువ అయినప్పటికీ పోలిక కరెక్ట్ కాదు. విడుదలైన స్క్రీన్స్ ప్రకారం చూసుకుంటే చైతు సినిమానే భారీ ఎత్తున విడుదలైంది. వీక్ ఎండ్ నాలుగు రోజులు వస్తుంది కాబట్టి దాన్ని శైలజారెడ్డి అల్లుడు ఎలా వాడుకుంటాడు అనే దాన్ని బట్టే రేంజ్ ఆధారపడి ఉంటుంది. ఏరియా వారీగా సైతం చైతు తన వరకు కొత్త రికార్డ్స్ అందుకున్నాడు.

నైజామ్ – 1 కోటి 69 లక్షలు

సీడెడ్ – 81 లక్షలు

ఉత్తరాంద్ర – 60 లక్షలు

గుంటూరు – 59 లక్షలు

ఈస్ట్ గోదావరి – 72 లక్షలు

వెస్ట్ గోదావరి – 41 లక్షలు

కృష్ణా – 40 లక్షలు

నెల్లూరు- 23 లక్షలు

తెలుగు రాష్ట్రాలు మొత్తం 1 రోజు షేర్ – 5 కోట్ల 45 లక్షలు

ఇది అధికారిక సమాచారం కాకపోయినా ట్రేడ్ నుంచి అందిన రిపోర్ట్స్ ని బట్టి చూస్తే చైతు మంచి వసూళ్లు అందుకున్నాడు. డివైడ్ టాక్ పాజిటివ్ గా మారుతుందా లేక వసూళ్ల పై దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే క్లారిటీ మరో మూడు రోజులు గడిచాక కానీ చెప్పలేం. యుటర్న్ థ్రిల్లర్ జానర్ కాబట్టి మాస్ ఆడియన్స్ కున్న ఆప్షన్ గా మిగిలిన శైలజారెడ్డి అల్లుడు కనక ఇదే తరహాలో కొనసాగితే సేఫ్ అవ్వొచ్చు. కానీ అది కలెక్షన్లు స్టడీగా ఉంటేనే సాధ్యమవుతుంది. మంచి ఛాన్స్ ని చైతు ఎంత వరకు ఉపయోగించుకుంటాడో వేచి చూడాలి.