ట్రైలర్ టాక్: దేవుడు గట్టిగా తొక్కేశాడు అంటున్న చైతు

0అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ ట్రైలర్ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “నాపేరు చైతన్య.. ముద్దుగా అందరూ చైతు అంటారు. దేన్నైనా పాజిటివ్ గా తీసుకునే సాఫ్ట్ కాండిడేట్ ని. మనం లైఫ్ లో ప్రేమించే ప్రతిదాని వెనక ఓ కష్టముంటుంది. కానీ అది తట్టుకోగలిగితే లైఫ్ కలర్ ఫుల్ గా ఉంటుంది.” అంటూ తనను తాను పరిచయం చేసుకోవడంతో ట్రైలర్ స్టార్ట్ అయింది. నాన్న(మురళి శర్మ) రూపంలో చిన్నప్పుడు.. ఇప్పుడేమో లవర్ రూపంలో మరొకరు.. అత్త రూపం లో ఇంకొకరిని ఇచ్చి దేవుడు గట్టిగా తొక్కేశాడు అని వాపోతున్నాడు.

ఇక చైతు ఫ్రెండ్ పాత్రలో వెన్నెల కిషోర్ పంచ్ లు – శైలజా రెడ్డి భర్త పాత్రలో సీనియర్ నరేష్ అమ్మకి- కూతురికి మధ్యలో శాండ్ విచ్ అయిపోవడం – శైలజా రెడ్డి సెక్రెటరీ(30 ఇయర్స్ పృథ్వి)ని అమ్మా కూతుళ్ళు కలిసి ‘మాణిక్యం.. మాణిక్యం’ అని మాటిమాటికీ ఆరుస్తూ ఎర్రటి మంటలో కబాబ్ ను కాల్చినట్టు కాల్చుకొని తినడం తో ఫన్ బాగానే జనరేట్ అయింది. ఇక సినిమా ఫుల్ ఎంటర్టైనర్ అనే హింట్ స్తూ రొమాన్స్ – ఫైట్స్ – కామెడీ సీన్స్ అన్నీ కవర్ చేశారు. ఎండ్ లో ‘ప్రియరాగాలే’ సాంగ్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించడం ఒక నోస్టాల్జిక్ ఫీలింగ్ తో పాటు నాగ్ ని గుర్తుకు తెస్తుంది.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. మ్యూజిక్ – సినిమాటోగ్రఫీ అంతా పర్ఫెక్ట్. కాకపోతే ట్రైలర్ అత్తా – అల్లుడు ఫైట్ సినిమాల రెగ్యులర్ టెంప్లేట్ ను గుర్తుకు తెస్తుంది. ఇక సినిమాలో మారుతి ఏదైనా మ్యాజిక్ చేశాడా అన్నది చూడాలి. ఇక మరొక్క విషయం ఏంటంటే చైతు భయ్యా తన డిక్షన్ విషయంలో మరి కాస్త శ్రద్ధ తీసుకుంటే ఇంకా సూపర్! ఇంకెందుకు ఆలస్యం.. త్వరగా ట్రైలర్ చూసేయండి లేకపోతే మాణిక్యం మరోసారి ‘నా బాధ వర్ణనాతీతం’ అంటాడు!