శీనూకి వెంకన్న సామి ఆశీస్సులు

0బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన `సాక్ష్యం` ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజవుతున్న సంగతి తెలిసిందే. `లౌక్యం` వంటి బ్లాక్బస్టర్ని అందించిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీను సరసన ముంబై భామ పూజా హెగ్డే కథానాయికగా నటించింది. పంచభూతాలే మాకు సాక్ష్యం. ఈ సినిమా విజయానికి అవి సహకరిస్తాయని టీమ్ ప్రకటించింది.

పంచభూతాల కాన్సెప్టే తమను గెలిపిస్తుందన్న ధీమాని దర్శకహీరోలు ఇంటర్వ్యూల్లో వ్యక్తం చేశారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అంటూ అంతా కాన్ఫిడెన్స్ని ప్రదర్శించారు. ఇకపోతే సినిమా రిలీజ్ ముందు యథావిధిగా సెంటిమెంటును ఫాలో చేస్తూ వెంకన్న సామి ఆశీస్సులు అందుకునేందుకు తిరుమలకు పయనమైంది సాక్ష్యం టీమ్. బెల్లంకొండ శ్రీనివాస్ – పూజా హెగ్డే – అభిషేక్ నామా బృందం విమానం నుంచి దిగిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. లార్డ్ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందుకునేందుకు వెళ్లిన శ్రీను అండ్ టీమ్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఈ శుక్రవారమే రిలీజ్ కాబట్టి.. రిజల్ట్ ఏంటో వేచి చూడాలి. శ్రీనులోని యాక్షన్ స్టార్ ని ఆవిష్కరిస్తున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.