రెండో రోజు కూడా సల్మాన్ జైల్లోనే..

0కృష్ణజింక కేసులో దోషి గా తేలిన సల్మాన్ ఖాన్ ను కోర్ట్ ఐదేళ్ల జైలు శిక్ష తో పాటు పదివేల జరిమానా విధించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న సల్మాన్ ..బెయిల్ కోసం కోర్ట్ ను కోరడం జరిగింది. కానీ జోధ్‌పూర్‌ ఉన్నత న్యాయస్థానం పిటిషన్ ను రేపటికి వాయిదా వేసింది. దీంతో సల్మాన్ రెండో రోజు కూడా జైలులోనే గడపాల్సి వస్తుంది.

1998లో సల్మాన్‌ హమ్‌ సాథ్‌ సాథ్‌ హై చిత్రీకరణ నిమిత్తం జోధ్‌పూర్‌ వెళ్లారు. ఆ సమయంలో కంకణి గ్రామంలో సంచరిస్తున్న రెండు కృష్ణ జింకలపై కాల్పులు జరిపారు. దీనిపై కేసు నమోదు చేశారు. 20ఏళ్ల పాటు సాగిన ఈ కేసు తీర్పు నిన్న వచ్చింది. ఈ కేసులో సల్మాన్ దోషి గా తేలడం తో అభిమానులతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ లో పడింది.