బన్నీ బన్నీ అంటున్న సల్లూ భాయి బామ్మర్ది!

0ఏమాటకామాటే మన అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ ఫ్లోర్ మాత్రమే కాదు టోటల్ ఆడిటోరియం టాపు లేచిపోద్ది. అది ‘ఆ అంటే అమలాపురం’ కావొచ్చు లేదా ‘సినిమా చూపిస్త మావా’ కావచ్చు.. ఇలాంటి మాస్ స్టెప్పులే కాకుండా ‘ఉప్పెనంత ఈ ప్రేమకి’ పాటలో వేసే క్లాస్ స్టెప్స్ + మూన్ వాక్ డాన్స్.. ఏదైనా సరే బన్నీ ఓ బ్రిలియంట్ డ్యాన్సర్. మరి ఎవరైనా బన్నీ డ్యాన్స్ కు ఫిదా అవుకుండా ఉండలేరు కదా. అలానే ఓ బాలీవుడ్ హీరో బన్నీ డ్యాన్స్ కు ఫిదా అయ్యాడు.

సల్మాన్ ఖాన్ బావమరిది అయుష్ శర్మ ‘లవ్ రాత్రి’ సినిమా ద్వారా బాలీవుడ్ లో హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ నిర్మిస్తుండగా అభిరాజ్ మీనవాలా దర్శకుడు. ఈ సినిమా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఆయుష్ శర్మ రీసెంట్ గా హైదరాబాద్ వచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ డ్యాన్స్ విషయంలో తనకు ఇన్స్పిరేషన్ అల్లు అర్జున్ అని చెప్పాడు. అల్లు అర్జున్ ఒక సూపర్బ్ డాన్సర్ అని – తాను ఏదో ఒకరోజు అతనిలాగా డ్యాన్స్ చేయాలని అనుకుంటున్నానని.. అయితే బన్నీని తను 100% మ్యాచ్ చేయలేనని – కానీ ప్రయత్నం మాత్రం చేస్తానని అన్నాడు. కొత్త హీరో అయినా ఇది బన్నీ కి పెద్ద కాంప్లిమెంటే. ఇప్పటికే బన్నీ హిందీ డబ్బింగ్ సినిమాలు టీవీ చానల్స్ తో సూపర్ టీఆర్ పీ రేటింగులతో – యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దుమ్ము లేపుతుంటాయి. ఇక హిందీ ప్రేక్షకులతో పాటు హీరోలు కూడా బన్నీ కి ఫిదా అవుతున్నారంటే అది బన్నీ ఫాన్స్ కు ఓ గుడ్ న్యూసే.

ఇదిలా ఉంటే అయుష్ శర్మ కూడా ఓ మంచి డ్యాన్సర్. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘లవ్ రాత్రి’ ట్రైలర్ లో మంచి స్టెప్పులతో ప్రేక్షకులను మెప్పించాడు. మరి బన్నీ సినిమాలో ఇంకా సూపర్ స్టెప్పులతో బన్నీలానే అదరగొడతాడేమో వేచి చూడాలి.