టైగర్ జిందా హై.. సల్మాన్ ఫస్ట్ లుక్

0సల్మాన్ ఖాన్ నటిస్తున్న టైగర్ జిందా హై ఫస్ట్ పోస్టర్ రిలీజైంది. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సల్మాన్ ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా సల్మాన్ ఈ ఫిల్మ్‌లో నటిస్తున్నాడు. గన్ పట్టుకుని ఉన్న సల్మాన్.. పోస్టర్‌లో చాలా సీరియస్‌గా ఉన్నాడు. అలీ అబ్బాస్ జాఫర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. 2012లో వచ్చిన ఏక్తా టైగర్‌కు సీక్వెల్‌గా టైగర్ జిందా హై వస్తున్నది. టైగర్ కోసం యాక్షన్ సీన్లను మొరాక్కో, అబుదాబిలో చిత్రీకరించారు. ఇందులో కత్రినా కైఫ్ కూడా నటిస్తున్నది. డిసెంబర్ 22న ఫిల్మ్ రిలీజ్‌కానున్నది.Tiger-Zinda-Hai-First-look